బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 19:45:16

గ‌ల్ఫ్ నుంచి వ‌చ్చిన ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ : కేర‌ళ సీఎం

గ‌ల్ఫ్ నుంచి వ‌చ్చిన ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ :  కేర‌ళ సీఎం

హైద‌రాబాద్‌: గ‌ల్ఫ్ దేశాల నుంచి వ‌చ్చిన ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ తేలిన‌ట్లు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని చెప్పారు.  అబుదాబి, దుబాయ్ నుంచి గురువారం ప్ర‌త్యేక ఎయిర్ ఇండియా విమానంలో సుమారు 363 మంది కేర‌ళ‌కు వ‌చ్చారు. దాంట్లో ఇద్ద‌రు క‌రోనా పాజిటివ్ తేలిన‌ట్లు సీఎం విజ‌య‌న్ తెలిపారు.అయితే ఒక‌రు కోజికోడ్‌లో, మ‌రొక‌రు కొచ్చిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిసింది. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 505కు చేరుకున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు అయిదు మంది మ‌ర‌ణించారు. మాల్దీవుల నుంచి కొచ్చి వ‌ర‌కు యుద్ద‌నౌక‌లో మ‌రో 698 మందిని త‌ర‌లిస్తున్నారు. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా విమాన స‌ర్వీసులు న‌డుపుతున్నారు. ఇక స‌ముద్ర శ‌క్తి ఆప‌రేష‌న్ పేరుతో యుద్ధ‌నౌక‌ల‌లోనూ విదేశాల్లో చిక్కుకున్న‌వారిని త‌ర‌లిస్తున్నారు.  విదేశాల నుంచి వ‌స్తున్న వారితో మూడ‌వ ద‌శ వైర‌స్ సంక్ర‌మ‌ణ కేసులు న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సీఎం విజ‌య‌న్ తెలిపారు. 


logo