ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 17:04:13

కోవిడ్ బాధితురాలిని వేధించిన ఇద్ద‌రు అరెస్ట్‌

కోవిడ్ బాధితురాలిని వేధించిన ఇద్ద‌రు అరెస్ట్‌

నోయిడా: గ‌్రేట‌ర్ నోయిడాలోని ఒక ప్రైవేటు ఆస్ప‌త్రిలో కోవిడ్‌-19 బాధితురాలిపై ఇద్ద‌రు సిబ్బంది వేధించిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్టు చేశారు. నిందితులైన శానిటేష‌న్ వ‌ర్క‌ర్ ప్ర‌వీణ్‌, స్టోర్ వ‌ర్క‌ర్‌ ల‌వ్‌కుష్‌పై ఐపీసీ సెక్ష‌న్ 354 ప్ర‌కారం కేసు న‌మోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. 

 శార‌దా ఆస్ప‌త్రి ప్ర‌తినిధి మాట్లాడుతూ... ఇటివ‌ల ఒక బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన మ‌హిళ‌(20) కోవిడ్ చికిత్స కోసం మా ఆస్ప‌త్రిలో చేరింది. ఆమెపై ఇద్ద‌రు సిబ్బంది లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు మా దృష్టికి వ‌చ్చింది. సీసీటీవీ పుటేజీల ఆధారంగా వారిద్ద‌రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాం.ఇద్ద‌రిని ఉద్యోగాల నుంచి తొల‌గించాం. వారిని నియ‌మించిన ఏజెన్సీకి స‌మాచారం ఇచ్చామ‌ని తెలిపారు. మ‌హిళ‌కు జ‌రిగిన ఇబ్బందికి త‌మ ఆస్ప‌త్రి త‌ర‌పున ఆమెను క్ష‌మాప‌న‌లు కోరుతున్న‌ట్లు పేర్కొన్నారు. 


logo