శనివారం 19 సెప్టెంబర్ 2020
National - Jun 19, 2020 , 22:13:52

హర్యానాలో పోలీసులపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

హర్యానాలో పోలీసులపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

హర్యానా : హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్‌ జిల్లాలోని భునా ప్రాంతంలో పోలీసులపై దాడి చేసిన వ్యక్తితోపాటు మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి లాక్‌డౌన్‌ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులు తెల్లవారుజూమున ౩గంటల సమయంలో విధుల్లో తిరుగుతున్న ఓ వ్యక్తిని, మహిళలను గుర్తించి కర్ఫూ సమయంలో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించి ఇంటికి వెళ్లిపొమ్మని ఆదేశించారు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు ఎందుకు వెళ్లాలంటూ.? పోలీసులను ఎదురు ప్రశించి  దాడి చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ కశ్మీర్‌ సింగ్‌ తెలిపారు. వీరిపై కేసు నయోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.logo