e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జాతీయం డబుల్‌ మ్యుటెంట్‌ నుంచి రక్షణకు రెండు డోసులు తప్పనిసరి

డబుల్‌ మ్యుటెంట్‌ నుంచి రక్షణకు రెండు డోసులు తప్పనిసరి

డబుల్‌ మ్యుటెంట్‌ నుంచి రక్షణకు రెండు డోసులు తప్పనిసరి

న్యూఢిల్లీ, మే 23: ఇండియాలో తొలిసారి వెలుగుచూసిన డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌, యూకేలోని కెంట్‌ రకం వైరస్‌పై టీకాలు పనిచేస్తాయా.. లేదా.. చేస్తే ఏ మేరకు రక్షణ కల్పిస్తాయి.. అన్న విషయంపై ఇంగ్లండ్‌ వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా టీకాలు రెండు డోసులు వేసుకొంటే ఈ రెండు రకాల వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తున్నదని తెలిపారు. డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌పై ఫైజర్‌ టీకా 88%, అస్ట్రాజెనెకా టీకా 60% సమర్థంగా పనిచేస్తున్నదని ఇంగ్లండ్‌ ప్రభుత్వ వైద్య విభాగం అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో కెంట్‌ రకంపై ఇది 93 శాతం, 66 శాతంగా ఉన్నది. అదే ఒక్క డోసు మాత్రమే వేసుకొంటే డబుల్‌ మ్యుటెంట్‌ నుంచి 33%, కెంట్‌ రకం నుంచి 50శాతం మాత్రమే రక్షణ లభిస్తుందని తేలింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డబుల్‌ మ్యుటెంట్‌ నుంచి రక్షణకు రెండు డోసులు తప్పనిసరి

ట్రెండింగ్‌

Advertisement