శనివారం 08 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 18:33:26

క‌రోనా కాటుకు రెండు రోజుల ప‌సిగుడ్డు బ‌లి

క‌రోనా కాటుకు రెండు రోజుల ప‌సిగుడ్డు బ‌లి

అగ‌ర్త‌లా : దేశంలో క‌రోనా కోర‌లు చాచింది. క‌రోనా కాటుకు రెండు రోజుల ప‌సిపాప బ‌లైంది. ఈ విషాద ఘ‌ట‌న త్రిపుర‌లోని అగ‌ర్త‌లా గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలో శ‌నివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

నెలలు నిండిన గ‌ర్భిణికి కాన్పు కోసం అగ‌ర్త‌లా ప్ర‌భుత్వాసుప‌త్రికి వ‌చ్చింది. ఆమెకు అక్క‌డ క‌రోనా టెస్టులు చేయ‌గా, ఫ‌లితం పాజిటివ్‌గా వ‌చ్చింది. గ‌ర్భిణి గురువారం పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ త‌ర్వాత పసిపాప న‌మూనాల‌ను వైద్యులు సేక‌రించి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పాజిటివ్ ఫ‌లితం వ‌చ్చింది. రెండు రోజుల పాటు కొవిడ్‌తో పోరాడిన ఆ పాప‌.. శ‌నివారం ప్రాణాలు కోల్పోయింది. 

త్రిపుర‌లో క‌రోనా మృతుల సంఖ్య 23కు చేరింది. ఆ రాష్ర్టంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,251కి చేరిన‌ట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. 


logo