మంగళవారం 31 మార్చి 2020
National - Feb 20, 2020 , 10:29:17

దొంగతనం నెపంతో దళితుల బట్టలూడదీసి కొట్టారు..

దొంగతనం నెపంతో దళితుల బట్టలూడదీసి కొట్టారు..

జైపూర్‌ : దొంగతనం చేశారనే నెపంతో దళిత యువకులైన ఇద్దరిని తీవ్రంగా హింసించి, బట్టలూడదీసి కొట్టారు. అంతటితో ఆగకుండా వారి జననాంగాలపై పెట్రోల్‌ పోసి మానసికంగా వేధించారు. ఈ ఘటన రాజస్థాన్‌ నాగౌర్‌ గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌లో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 24 ఏళ్ల యువకుడు తన సోదరుడితో కలిసి పెట్రోల్‌ బంక్‌కు ఆదివారం వెళ్లారు. అయితే వీరిద్దరూ దొంగతనం చేశారని, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది వారిపై దాడికి పాల్పడ్డారు. యువకులిద్దరి బట్టలూడదీసి, జననాంగాలపై పెట్రోల్‌ పోశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ఘటనపై బాధిత యువకులు ఇద్దరూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దాడికి పాల్పడ్డ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


logo
>>>>>>