గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 17:56:50

కేరళలో ఇవాళ రెండే కేసులు

కేరళలో ఇవాళ రెండే కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. శనివారం కేవలం రెండు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయని, కరోనా నుంచి ఒకరు కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల గల్ఫ్‌ నుంచి తిరిగొచ్చారని సీఎం మీడియా సమావేశంలో చెప్పారు. 

ఈ వైరస్‌ సోకిన వ్యక్తులు మే ఏడో తేదీన దుబాయ్‌-కోజీకోడ్‌, అబుధాబి-కోచీ విమానాల్లో కేరళకు వచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకూ కేరళలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 505కు పెరిగింది. ప్రస్తుతం 17 మంది కరోనా బాధితులు మాత్రమే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. logo