ఆదివారం 29 మార్చి 2020
National - Feb 16, 2020 , 09:22:02

యువతిపై ఇద్దరు పోలీసుల అత్యాచారం

యువతిపై ఇద్దరు పోలీసుల అత్యాచారం

హైదరాబాద్‌: గుర్తుతెలియని ఇద్దరు పోలీసులు 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని హోటల్‌ గదిలో గడిచిన గురువారం నాడు చోటుచేసుకుంది. బాధిత యువతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నాడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సామూహిక అత్యాచారంతో పాటు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంతవరకు ఎటువంటి అరెస్టులు చోటుచేసుకోలేదు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, పూర్వాంచల్‌ సేనా గోరఖ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టాయి. స్టేషన్‌ స్టాఫ్‌ అందరినీ సస్పెండ్‌ చేసి మేజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో యువతి చికిత్స పొందుతుంది. నిందితులను గుర్తుపట్టనున్నట్లు తెలిపింది. బాధిత యువతి కోచింగ్‌ క్లాసులు చెబుతూ జీవనం సాగిస్తుంది. తండ్రి కూలీ.


logo