గురువారం 02 జూలై 2020
National - Jun 27, 2020 , 16:51:18

గాల్వ‌న్ అమ‌రుల సంతాప స‌భ‌లో కొట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

గాల్వ‌న్ అమ‌రుల సంతాప స‌భ‌లో కొట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

జైపూర్ : రాజ‌స్థాన్ లోని అజ్మీర్ లో గాల్వ‌న్ వ్యాలీ ఘ‌ర్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భార‌తీయ ఆర్మీ సిబ్బందికి నివాళుల‌ర్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సంతాప స‌మావేశానికి నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో వేదిక‌పై ఉన్న ఇద్ద‌రు కాంగ్రెస్ నాయ‌కులు కొట్టుకున్నారు. ఒక‌రికొకరు త‌న్నుకోవ‌డంతో.. దుస్తులు కూడా చినిగిపోయాయి. ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌ల‌ను శ్యామ్ సుధీన్, సోన ధ‌న్ వానిగా పార్టీ సీనియ‌ర్లు గుర్తించారు. వీరిద్ద‌రూ గొడ‌వ ప‌డ‌టంతో అక్క‌డున్న మిగ‌తా నాయ‌కులు వారికి న‌చ్చ‌జెప్పి విడిపించారు.  ఫోటోలు తీసే స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకున్న‌ట్లు తెలిసింది.  

ఈ ఘ‌ట‌న‌పై స్థానిక కాంగ్రెస్ నాయ‌కుడు విజ‌య్ జైన్ మాట్లాడుతూ.. ఇద్ద‌రు కూడా త‌మ పార్టీకి సంబంధించిన వారు కాద‌ని స్ప‌ష్టం చేశారు. గాల్వ‌న్ వ్యాలీ అమ‌రుల‌కు నివాళుల‌ర్పించే స‌భ‌లో ఈ గొడ‌వ చోటు చేసుకోవ‌డం సిగ్గుచేటుగా ఉంద‌న్నారు. 


logo