సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 15:06:10

పాక్ కాల్పులు.. ఇద్ద‌రు పౌరుల‌కు గాయాలు

పాక్ కాల్పులు.. ఇద్ద‌రు పౌరుల‌కు గాయాలు

శ్రీన‌గ‌ర్ : పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. ప‌దేప‌దే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. భార‌త సైనిక శిబిరాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కాల్పుల‌కు పాల్ప‌డుతోంది పాక్.

తాజాగా శ‌నివారం మ‌ధ్యాహ్నం పాకిస్తాన్ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బారాముల్లా జిల్లాలోని హ‌జిపీర్ సెక్టార్ లో పాక్ రేంజ‌ర్లు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. భారీ ఆయుధాల‌తో కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు సైనిక అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు పౌరులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను అహ్మ‌ద్ షేక్, మ‌క్బూల్ మంగ్రాల్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పాక్ కాల్పుల‌ను భార‌త సైన్యం స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడుతోంది. 


logo