శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 12:34:49

150కిపైగా నదుల జలాలతో అయోధ్య చేరిన సోదరులు

150కిపైగా నదుల జలాలతో అయోధ్య చేరిన సోదరులు

లక్నో: ఇద్దరు సోదరులు 150కిపైగా నదుల నుంచి పవిత్ర జలాలను సేకరించారు. ఈ జలాలతో అయోధ్యకు చేరారు. భవ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5న శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 52 ఏండ్లుగా నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో ఆ ఇద్దరు సోదరులు అయోధ్యకు చేరుకున్నారు. తాము 1968 నుంచి 151 నదులు, 8 పెద్ద నదులు, మూడు సముద్రాల జలాలతో పాటు శ్రీలంకలోని 16 పవిత్ర స్థలాల నుంచి మట్టిని సేకరించినట్లు ఆ సోదరుల్లో ఒకరైన రాధే శ్యామ్ పాండే తెలిపారు. అయోధ్యలో భూమిపూజ కోసం వీటిని అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.


తాజావార్తలు


logo