ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 03, 2020 , 01:42:56

151 నదుల పుణ్యజలం

151 నదుల పుణ్యజలం

  • అయోధ్య ఆలయం కోసం 
  • సేకరించిన ఇద్దరు సోదరులు

అయోధ్య, ఆగస్టు 2: అయోధ్య రాముడి దివ్య మందిరం కోసం ఇద్దరు సోదరులు అసాధారణ పుణ్యకార్యం చేపట్టారు. రాధేశ్యాం పాండే, శబ్ద్‌ వైజ్ఞానిక్‌ మహాకవి త్రిఫల అనే సోదరులు రామాలయ నిర్మాణం కోసం 151 నదుల పుణ్యజలాలు సేకరించారు. భారత్‌లోనే కాకుండా శ్రీలంక నుంచి కూడా పుణ్యజలాలు, పవిత్ర మట్టిని తీసుకొచ్చారు. అక్కడి నదులతోపాటు మూడు సముద్రాల జలాలు, రామాయణంలో ప్రస్తావించిన 16 ప్రదేశాల నుంచి మట్టిని కూడా సేకరించారు. 1958లో ప్రారంభించిన ఈ బృహత్‌కార్యాన్ని 2019లో పూర్తిచేశారు. 5న ఆలయానికి భూమిపూజ నిర్వహిస్తుండటంతో వారు సేకరించిన పవిత్ర జలాలు, మట్టిని అయోధ్యకు తరలించారు.


logo