శనివారం 11 జూలై 2020
National - Jun 17, 2020 , 19:31:30

మ్యూజిక్‌ డైరెక్టర్‌ హత్య..ఇద్దరు అరెస్ట్‌

మ్యూజిక్‌ డైరెక్టర్‌ హత్య..ఇద్దరు అరెస్ట్‌

న్యూఢిల్లీ: మ్యూజిక్‌ డైరెక్టర్‌ను హత్య చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌‌లోని చాప్రాకు చెందిన బోజ్‌పురి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ చౌదరి ద్వారకాలోని మోహన్‌ గార్డెన్‌ ప్రాంతంలోని తన  అద్దె ఫ్లాట్‌లో గతేడాది కాలంగా   నివసిస్తున్నాడు. స్థానికులు వాసన వస్తున్నట్లు పోలీసులకు సమాచారమందించగా ముఖేశ్ చౌదరి  తన  ఫ్లాట్‌లో విగతజీవిగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖేశ్‌ చౌదరిని హత్యచేసిన కేసులో బీహార్‌కు చెందిన మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌కుమార్‌, విక్కీ సీ అనే గాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులిద్దరూ డబ్బు వివాదానికి సంబంధించిన విషయంలో ముఖేశ్‌ చౌదరి కాళ్లు, చేతులు కట్టేసి, కేబుల్‌ వైర్‌తో గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా ఇద్దరిని అరెస్ట్‌ చేసి..దర్యాప్తు కొనసాగిస్తున్నామని ద్వారకా డీసీపీ ఆంటో ఆల్పోన్స్‌ తెలిపారు. 


logo