బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 02:34:04

దేశంలో 24 గంటల్లో 12,881 కేసులు

దేశంలో 24 గంటల్లో 12,881 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఏడో రోజు కూడా 10,000లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం నుంచి గురువారం నాటికి 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,881 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,66,946కు పెరిగింది. కేవలం ఈ నెల 1 నుంచి 18వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 1,76,411 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లో ఎక్కువ కేసులు బయటపడ్డాయి. వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 1,94,324 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 52.95 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 12,237కు చేరింది. మరోవైపు కొవిడ్‌-19 పై పోరాటంలో ముందుండి వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందికి సమయానికి వేతనాలు చెల్లించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 


logo