మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 17:57:16

వచ్చే పది రోజుల్లో 2600 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు

వచ్చే పది రోజుల్లో 2600 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ: వచ్చే పదిరోజుల్లో 36 లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించనున్నామని రైల్వేశాఖ ప్రకటించింది. వీరికోసం 2600 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతామని  రైల్వే అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్‌తో 19 రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను 16 రాష్ర్టాల్లోని గమ్యస్థానాలకు చేరవేయనున్నామని తెలిపారు. ఈ నెల 1న ప్రారంభమైన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు 45 లక్షల మందిని వారి సొంతూళ్లకు తరలించామని చెప్పారు. 

లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించడానికి మే 1 నుంచి వంద జతల రైళ్లను నడిపామని, సాధారణ ప్రయాణికుల కోసం 15 జతల రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఢిల్లీ నుంచి రాష్ర్టాల రాజధానులకు నడిపామని తెలిపారు. ఇప్పటిరకు 4.7 మిలయన్ల మంది ప్రయాణికులు, ఇతరులకు ఉచితంగా భోజన వసతి కల్పించామని అన్నారు.


logo