శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 12:46:15

కోయంబేడులో కరోనా విజృంభణ.. 2,600 మందికి పాజిటివ్‌

కోయంబేడులో కరోనా విజృంభణ.. 2,600 మందికి పాజిటివ్‌

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్‌ కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. తమిళనాడు వ్యాప్తంగా 9,227 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. కేవలం కోయంబేడు మార్కెట్‌లోనే 2,600 కేసులు నమోదైనట్లు ప్రత్యేక నోడల్‌ అధికారి తెలిపారు. కోయంబేడు మార్కెట్‌లో పని చేస్తున్న కార్మికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అందులో 2,600 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. వీరితో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2.6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్తగా 509 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో 64 మంది ప్రాణాలు కోల్పోయారు.

అర్బన్‌ స్లమ్స్‌ ఏరియాల్లో కరోనాను నివారించడం పెద్ద సవాలే అని నోడల్‌ ఆఫీసర్‌ చెప్పారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ.. ముఖానికి మాస్కు ధరిస్తే కరోనాను కట్టడి చేయొచ్చు అని ఆయన తెలిపారు. నిరంతరం చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందన్నారు. 


logo