మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 13:01:21

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'‌గా నిలిచిన అత‌నికి క‌ప్‌కు బ‌దులు చేతిలో 'చేప'!

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'‌గా నిలిచిన అత‌నికి క‌ప్‌కు బ‌దులు చేతిలో 'చేప'!

సాధార‌ణంగా క్రికెట్‌లో బాగా ఆడిన వారికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అనే బిరుదు ఇస్తారు. దీంతోపాటు 'క‌ప్' లేదంటే ఫ్రైజ్‌మ‌నీ ఇస్తార‌ని తెలుసు. కానీ ఇత‌నికి మాత్రం చేతిలో చేప‌ను పెట్టి పంపిచారు. ఇలా చేయ‌డానికి కూడా బ‌ల‌మైన కార‌ణ‌మే ఉందంటున్నారు. అంతేకాదు ఇలాంటి విచిత్ర‌మైన అవార్డులు ప్ర‌ధానం చేయ‌డం అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల‌ల్లో కూడా చూడొచ్చు అంటున్నారు. మ‌రి ఈ క్రికెట్ ఎక్క‌డ జ‌రిగింది, ఎందుకు ఇలా చేశారో తెలుసుకోవాల‌నుందా..! ఇటీవ‌ల క‌శ్మీర్‌లోని టెకీపొరా కుప్వారాలో ఓ క్రికెట్ టోర్న‌మెంట్ జ‌రిగింది. ఇందులో ఓ వ్య‌క్తి బాగా ఆడాడు. అత‌న్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మ్యాచ్ నిర్వాహ‌కులు అత‌నికి 2.5 కిలోల చేప‌ను అవార్డుగా ఇచ్చారు.

ఈ విష‌యాన్ని స‌మాజానికి తెలియ‌జేసేందుకు అక్క‌డే క‌శ్మీర్ జ‌ర్న‌లిస్ట్ ఫిర్దోజ్ హ‌స్స‌న్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ కాగా నెటిజ‌న్ల‌కు సందేహాలు ఎక్కువైపోయాయి. అత‌నికి ఎందుకు చేప‌ను ప్ర‌సెంట్ చేశారు అంటూ అంద‌రూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఫిర్దోజ్ ఇలా రీట్వీట్ పెట్టారు. ‘‘ఆ ఆటగాళ్లు ఉపయోగిస్తున్న క్రికెట్ గ్రౌండ్ దయనీయ స్థితిలో ఉంది. దీనిక గురించి తెలియ‌జేసేందుకు  ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. చేపను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఇవ్వడం ద్వారా ఆ సమస్య వెంట‌నే అధికారుల దృష్టిలో పడుతుందనే ఉద్దేశంతోనే ఇలా చేశామని చెప్పారు’’ అని హస్సన్ మరో ట్వీట్‌లో వెల్లడించాడు.


logo