గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 20:52:59

బెంగాల్‌లో 1,300 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

బెంగాల్‌లో 1,300 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజూ వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శ‌నివారం కూడా కొత్త‌గా 2,404 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో బెంగాల్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56,377కు చేరింది. అందులో 35,654 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 19,391 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా క్ర‌మంగా పెరుగుతున్నాయి. శ‌నివారం కొత్త‌గా 42 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1332కు చేరింది. ప‌శ్చిమ‌బెంగాల్ ఆరోగ్యశాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.                     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo