శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 15:01:55

2,290 మందికి కరోనా.. అందరివి తప్పుడు అడ్రస్‌లే..

2,290 మందికి కరోనా.. అందరివి తప్పుడు అడ్రస్‌లే..

లక్నో : కరోనా బాధితులంతా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. నమూనాలను ఇచ్చే సమయంలో తప్పుడు అడ్రస్‌లు ఇచ్చి అధికారులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో కరోనా పరీక్షల సమయంలో 2,290 మంది తప్పుడు అడ్రస్‌లు ఇచ్చారు. వీరందరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో.. వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. వీరు ఇచ్చిన మొబైల్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే కలవడం లేదు. పోని ఇంటి అడ్రస్‌ను ట్రేస్‌ చేస్తే అది కూడా ఫేకే అని తేలుతుంది. ఈ క్రమంలో వైద్యాధికారులు.. పోలీసుల సహాయం తీసుకుంటున్నారు. 

జులై 23 నుంచి 31వ తేదీ మధ్యలో సుమారు 3 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరంతా తప్పుడు మొబైల్‌ ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌లు ఇచ్చారు. మొత్తానికి పోలీసుల సహాయంతో 1,171 మందిని గుర్తించారు. మరో 1,119 మందిని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కరోనా టెస్టుల సమయంలో తప్పుడు అడ్రస్‌లు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. 

లక్నోలో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 391 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 14 మంది చనిపోయారు. యూపీలో నిన్న ఒక్కరోజే కొత్తగా 3,953 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91,921కి చేరింది. మృతుల సంఖ్య 1,730కు చేరింది. 


logo