ఆదివారం 12 జూలై 2020
National - Jun 05, 2020 , 07:37:15

దేశంలో మొత్తం 2,26,334 పాజిటివ్‌ కేసులు

దేశంలో మొత్తం 2,26,334 పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు  2,26,334 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 10వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటివరకు 6,331 మంది మృతి చెందారు.1,08,580 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.

ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 77,793కు చేరుకుంది. గురువారం ఒక్క రోజే 123 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.  దేశరాజధాని నగరం ఢిల్లీలో కొత్తగా1359 కేసులు నమోదుకాగా..మొత్తం కేసులు 25వేలకు పైగా నమోదయ్యాయి. 


logo