సోమవారం 13 జూలై 2020
National - Apr 02, 2020 , 16:39:00

దేశంలో ఇప్పటి వరకు 1965 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో ఇప్పటి వరకు 1965 కరోనా పాజిటివ్‌ కేసులు

ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 1965 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కరోనా నుంచి 151 మంది బాధితులు కోలుకున్నారు. ఢల్లీ మర్కజ్‌ వచ్చిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు. పుదుచ్చేరి, అసోం, జమ్ముకశ్మీర్‌ వాసులున్నారు. జమాతే ఉదంతం వల్లే 400 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. నిజాముద్దీన్‌ మార్కజ్‌ తర్వాత దేశవ్యాప్తంగా 9వేల మందిని క్వారంటైన్‌ చేశాం. మర్కజ్‌లో హాజరై అక్కడే ఉండిపోయిన వారిలో 1804 మందిని క్వారంటైన్‌ చేశాం. ఐసోలేషన్‌, కరోనా పరీక్షలపై దృష్టి సారించాలని ప్రధాని రాష్ర్టాలకు సూచించారు. గడిచిన 24 గంటల్లో 328 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 50 మంది మృతి చెందారని తెలిపారు. 


logo