శనివారం 06 జూన్ 2020
National - May 11, 2020 , 22:28:42

పెట్రోల్ ట్యాంక్ లో 190 మ‌ద్యం కాట‌న్లు

పెట్రోల్ ట్యాంక్ లో 190 మ‌ద్యం కాట‌న్లు

బీహార్ : ఓ వైపు లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా కొంత‌మంది అక్ర‌మంగా మ‌ద్యాన్ని ర‌వాణా చేస్తున్నారు. బీహార్ లో భారీగా మొత్తంలో మ‌ద్యం కాట‌న్ల‌ను ఎక్సైజ్ అధికారులు ప‌ట్టుకున్నారు. పాట్నాలోని కడంకువాన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఓ పెట్రోల్ ట్యాంక‌ర్ లో దాచిపెట్టి తీసుకెళ్తున్న 190 మ‌ద్యం కాట‌న్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మ‌ద్యాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌ద్యాన్ని ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి ర‌వాణా చేస్తున్నార‌నే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo