బుధవారం 15 జూలై 2020
National - Jun 26, 2020 , 17:38:03

కరోనా ఎఫెక్ట్‌..18 వేల మంది ఖైదీలు పెరోల్‌పై విడుదల

కరోనా ఎఫెక్ట్‌..18 వేల మంది ఖైదీలు పెరోల్‌పై విడుదల

లక్నో:  కరోనావ్యాప్తి నేపథ్యంలో ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం జూన్‌ 25 వరకు 17,963 మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసిందని హోం శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి అవనీష్‌ కుమార్‌ అవస్తి  తెలిపారు. జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు నుంచి వచ్చిన అనుమతుల మేరకు 665 మంది మైనర్లను బాలల సంరక్షణ కేంద్రం నుంచి పెరోల్‌పై విడుదల చేసినట్టు పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏడేళ్లలోపు జైలుశిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు తెలిపారు. యూపీలో ఇప్పటివరకు 19వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి 596 మంది కరోనాతో మృతి చెందారు. 


logo