సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 14:43:21

భార‌త్‌, నేపాల్‌లో వ‌ర‌ద‌లు.. 189 మంది మృతి

భార‌త్‌, నేపాల్‌లో వ‌ర‌ద‌లు.. 189 మంది మృతి

ఢిల్లీ : భార‌త్ ఈశాన్య రాష్ర్టం అసోంలో అదేవిధంగా పొరుగున ఉన్న నేపాల్‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల వ‌ల్ల దాదాపు 40 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. 189 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు నేడు వెల్ల‌డించారు. డ‌జ‌న్ల కొంది మంది ఆచూకీ గ‌ల్లంతు అయిన‌ట్లు తెలిపారు. టిబెట్, భారత్‌, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నది వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌స్థాయిల‌ను దాటి ఉప్పొంగ‌టంతో పంట‌లు దెబ్బ‌తిన్నాయి. పొలాలు బుర‌ద‌మ‌య‌మ‌య్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 

అస్సాంలో మే నెల‌ చివరివారం నుండి మూడు ద‌ఫాలుగా సంభ‌వించిన వ‌ర‌ద‌ల్లో 2.75 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు, రాత్రి సంభ‌వించిన‌ మరో రెండు మరణాలు క‌లుపుకుని మొత్తం 79 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రమాదకరస్థాయిల‌ను మించి చాలా నదులు ప్రవహించడంతో వరద పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని అసోం జ‌ల వనరులశాఖ మంత్రి కేషాబ్ మహంత అన్నారు. ఒకవైపు వరదలు మ‌రోవైపు కరోనా వైరస్ మహమ్మారి అసోం జంట సవాళ్ల‌ను ఎదుర్కొంటుంద‌న్నారు.

పొరుగున ఉన్న నేపాల్‌లో ఆదివారం నుండి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం అంచ‌నా నేప‌థ్యంలో దక్షిణ మైదానాల్లోని నివాసితులను అప్రమత్తంగా ఉండాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం కోరింది. అక‌స్మాత్తుగా సంభ‌వించిన వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం వ‌ల్ల 110 మంది చ‌నిపోయిన‌ట్లు మ‌రో 100 మంది గాయ‌ప‌డ్డ‌ట్లు తెలిపారు. దేశంలోని 77 జిల్లాలో 26 జిల్లాలో వంద‌లాది మంది నిరాశ్ర‌యులైన‌ట్లు తెలిపారు. 48 మంది క‌నిపించ‌కుండా పోయినట్లు వెల్ల‌డించారు. రానున్న నాలుగు రోజులు నేపాల్‌కు భారీ వ‌ర్ష సూచ‌న ఉన్న‌ట్లు అక్క‌డి వాతావ‌ర‌ణశాఖ అధికారులు తెలిపారు.


logo