గురువారం 28 మే 2020
National - May 20, 2020 , 18:08:13

ఉద్యోగాన్ని వదులుకున్న 185 మంది నర్సులు

ఉద్యోగాన్ని వదులుకున్న 185 మంది నర్సులు

మణిపూర్‌: కోల్‌కతాలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు తమ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. 185 మంది నర్సులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి..ఇంఫాల్‌లోని క్రిస్టెల్లాకు తిరిగి వెళ్లారు.

ఓ నర్సు మీడియాతో మాట్లాడుతూ..మేము ఉద్యోగాలు వదులుకున్న తర్వాత సంతోషంగా లేము. కానీ విధులు నిర్వర్తించే సమయంలో మా పట్ల చాలా వివక్ష చూపిస్తున్నారు. కొంతమంది అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండగా..పీపీఈ కిట్స్‌ సరిపడా లేకపోవడంతో చాలా మంది ప్రజలు, రోగులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే  మాపై ఉమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo