శనివారం 04 జూలై 2020
National - Jun 15, 2020 , 19:41:17

త‌మిళ‌నాడులో ఒక్క‌రోజే 1843 కేసులు.. 44 మ‌ర‌ణాలు

త‌మిళ‌నాడులో ఒక్క‌రోజే 1843 కేసులు.. 44 మ‌ర‌ణాలు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. గ‌త మూడు వారాలుగా ప్ర‌తిరోజు వెయ్యికి త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం కూడా కొత్త‌గా 1843 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 46,504కు చేరింది. ఇక మ‌ర‌ణాల సంఖ్య ఆ రాష్ట్రంలో క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతున్న‌ది. సోమవారం కూడా 44 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. దీంతో త‌మిళ‌నాడులో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 479కి చేరింది. 

ఇక‌, త‌మిళ‌నాడులో న‌మోదైన‌ మొత్తం కేసుల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 25,344 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన వారు, క‌రోనా మృతులు పోగా ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 20,678 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా రాష్ట్రంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.   


logo