శుక్రవారం 29 మే 2020
National - Mar 28, 2020 , 17:42:19

లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌..అదుపులో 183 మంది

లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌..అదుపులో 183 మంది

డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్ లో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా లాక్ డౌన్ ను అమలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే ఓ వైపు జ‌నాలు ఇండ్లలోకి బ‌య‌ట‌కు రాకుండా పోలీసులు, అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటుంటే..కొంత‌మంది మాత్రం వాటిని లెక్క‌చేయ‌డం లేదు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 183 మందిని ఉత్త‌రాఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోనే..స్వీయ నిర్బంధంలో ఉండి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు. logo