గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 19:22:44

ITBP సిబ్బందిలో మ‌రో 18 మందికి క‌రోనా

ITBP సిబ్బందిలో మ‌రో 18 మందికి క‌రోనా

న్యూఢిల్లీ: భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. సెంట్ర‌ల్ రిజ‌ర్వ్‌డ్ పోలీస్‌ఫోర్స్ (CRPF), బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ (ITBP) సిబ్బందిలో నిత్యం కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. శ‌నివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో 18 మంది ITBP సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో  ITBP లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 421కి చేరింది. 

మొత్తం కేసుల‌లో 270 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 151 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఐటీబీపీ ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న 151 మంది ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వారు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo