శనివారం 23 జనవరి 2021
National - Dec 24, 2020 , 18:27:39

కాంగ్రెస్‌కు షాక్‌.. పార్టీని వీడిన 18 మంది కార్పొరేట‌ర్లు

కాంగ్రెస్‌కు షాక్‌.. పార్టీని వీడిన 18 మంది కార్పొరేట‌ర్లు

ముంబై : మహారాష్ట్రంలోని థానే జిల్లా భీవండి-నిజాంపూర్‌ మున్సిపల్ కార్పొరేష‌న్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. కార్పొరేష‌న్‌ పరిధిలోని 18 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరారు. గురువారం వీరంతా మూకుమ్మడిగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, ఎన్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌, మున్సిపల్ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ అలీ మొహ్మద్‌ఖాన్‌ సమక్షంలో ఎన్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య నేతలు పార్టీలు మారడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు కూటమిగా మహావికాస్‌ ఆగాడి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo