మంగళవారం 19 జనవరి 2021
National - Jan 06, 2021 , 09:43:58

దేశంలో కొత్తగా 18,088 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 18,088 కరోనా కేసులు

న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,088 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,74,932కు చేరాయి. కొత్తగా 21,314 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 99,97,272 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 264 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,50,114కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,27,546 ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. మంగళవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 9,31,408 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 17,74,63,405 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.