బుధవారం 27 జనవరి 2021
National - Jan 09, 2021 , 10:25:07

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఇందులో 1,00,56,651 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,24,190 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 1,50,798 మంది బాధితులు కరోనా మహమ్మారి వల్ల మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 228 మంది మరణించారు. కొత్తగా 19,253 మంది ప్రాణాంతక వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

కాగా, దేశంలో కరోనా కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివకు 19,61,975 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 3693 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 49,970 మంది మృతిచెందారు. ఇక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఢిల్లీ అత్యధిక రోజువారీ కేసులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.  


logo