మంగళవారం 02 జూన్ 2020
National - May 14, 2020 , 07:07:44

కువైట్ నుంచి అహ్మ‌దాబాద్ కు 177 మంది..

కువైట్ నుంచి అహ్మ‌దాబాద్ కు 177 మంది..

గుజ‌రాత్‌: లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న వారిని భార‌త్ కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్ర‌త్యేక విమానాలు న‌డిపిస్తోంది. వందేభార‌త్ మిష‌న్ లో భాగంగా కువైట్ కు వెళ్లిన ఎయిరిండియా విమానం..177 మంది ప్ర‌యాణికుల‌ను భార‌త్ కు తీసుకొచ్చింది.

విమానం కువైట్ నుంచి బ‌య‌లుదేరి అహ్మ‌దాబాద్ లోని స‌ర్దా్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఎయిరిండియా విమానం ముంబై మీదుగా అహ్మ‌దాబాద్ కు చేరుకుంది. కొంత‌మంది ప్ర‌యాణికులు ముంబైలో ల్యాండ్ అయ్యారు. ఎయిర్ పోర్టులో ప్ర‌త్యేక స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణికులంద‌రినీ క్వారంటన్ లో ఉంచ‌నున్నారు.  ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo