శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 21:56:23

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 17 క‌రోనా మ‌ర‌ణాలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 17 క‌రోనా మ‌ర‌ణాలు

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ప్ర‌తిరోజు వంద‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం కూడా కొత్త‌గా 710 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,310కి చేరింది. అందులో 6,888 యాక్టివ్ కేసులు కాగా మిగ‌తావారు వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక మ‌ర‌ణాల విష‌యానికి వ‌స్తే సోమ‌వారం కొత్త‌గా 17 మంది మృతిచెంద‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 738కి చేరింది. మ‌ధ్యప్ర‌దేశ్ ఆరోగ్య‌శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo