శనివారం 11 జూలై 2020
National - Jun 15, 2020 , 15:34:13

ఉత్తరాఖండ్‌లో నేడు 17 కరోనా కేసులు నమోదు

 ఉత్తరాఖండ్‌లో నేడు 17 కరోనా కేసులు నమోదు

ఉత్తరాఖండ్‌లో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. సోమవారం మరో 17 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా నేడు కరోనాతో మరణించిన వారు లేకపోవడంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇప్పుడు మొత్తం 1836  కేసులు నమోదు కాగా.. 1135 మంది కరోనా నుంచి బయట పడినట్లు తెలిపారు. ప్రస్తుతం 668 పాజిటీవ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 24 మంది మరణించినట్లు అధికారులు తెలియజేశారు. logo