శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 18:10:01

జెడ్డా నుంచి కొచ్చికి 149 మంది

జెడ్డా నుంచి కొచ్చికి 149 మంది

కొచ్చి: వ‌ందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న వేల‌ మందిని కేంద్ర ప్ర‌భుత్వం భార‌త్‌కు త‌ర‌లిస్తున్న‌ది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్ర‌యం 149 మంది ప్ర‌యాణికుల‌తో ఎయిర్ ఇండియా విమానం బ‌య‌లుదేరింది. గురువారం మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు జెడ్డా నుంచి బ‌య‌లు దేరిన ఈ విమానం ఈ అర్ధ‌రాత్రికి భార‌త్‌కు చేరుకోనుంది. విమానంలో బ‌య‌లుదేరిన మొత్తం 149 మంది ప్ర‌యాణికుల్లో 37 మంది గ‌ర్భిణిలు, 31 మంది మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉన్న‌వారు, 40 మంది లెయిడ్ ఆఫ్ వ‌ర్క‌ర్స్‌, 36 మంది విజిట్ వీసాపై వ‌చ్చిన వారు ఉన్నారు. ఏఐ-960 విమానం వారిని తీసుకుని బ‌య‌లుదేరింది.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo