శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 10:26:40

ఢాకా నుంచి శ్రీనగర్‌కు చేరుకున్న భారతీయ విద్యార్థులు

ఢాకా నుంచి శ్రీనగర్‌కు చేరుకున్న భారతీయ విద్యార్థులు

శ్రీనగర్‌ : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో చిక్కుకుపోయిన 169 మంది జమ్ముకశ్మీర్‌ విద్యార్థులు ఈ ఉదయం శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో విద్యార్థులు శ్రీనగర్‌కు చేరుకున్నారు. స్క్రీనింగ్‌ పరీక్షల అనంతరం వీరందరినీ క్వారంటైన్‌ నిమిత్తం హోటల్స్‌కు తరలించనున్నారు. జమ్ముకశ్మీర్‌ నుంచి సుమారు 7 వేల నుంచి 8 వేల మంది విద్యార్థులు బంగ్లాదేశ్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్నారు. కశ్మీర్‌ విద్యార్థులు బంగ్లాదేశ్‌లోని ఈస్ట్‌-వెస్ట్‌ మెడికల్‌ కాలేజీ, ఢాకా యూనివర్సిటీ, బంగ్లాదేశ్‌ మెడికల్‌ కాలేజీ, కొమిల్లా మెడికల్‌ కాలేజీ, ఈస్ట్రన్‌ మెడికల్‌ కాలేజీలో ఎక్కువగా విద్యనభ్యస్తుంటారు.


logo