శుక్రవారం 05 జూన్ 2020
National - May 21, 2020 , 18:12:07

ఢిల్లీలో 1,659 కేసులు.. 194 మరణాలు

ఢిల్లీలో 1,659 కేసులు.. 194 మరణాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రానికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 571 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,659కి చేరింది. ఇక ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 194 కి చేరుకుంది. కాగా, మొత్తం కేసులలో 5,567 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి రికవరీ అయిన వారు, మరణించిన వారు పోగా మిగలిన 5,898 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.


logo