బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Jul 02, 2020 , 15:03:11

ప‌ద‌హారేండ్ల‌ బాలిక‌పై సామూహిక అత్యాచారం!

ప‌ద‌హారేండ్ల‌ బాలిక‌పై సామూహిక అత్యాచారం!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. 16 ఏండ్ల బాలిక‌పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం భ‌దోయ్ జిల్లా ఔరాయ్ ఏరియాలో జూన్ 26న చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగుచూసింది. జూన్ 26న ఔరాయ్ ఏరియాలోని ఓ గ్రామంలో వివాహ వేడుక జ‌రిగింది. ఈ వివాహానికి హాజ‌రైన వారిలో న‌లుగురు వ్య‌క్తులు బాలిక‌ను నిర్జ‌న ప్ర‌దేశానికి ఎత్తుకెళ్లి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఘాతుకానికి పాల్ప‌డ్డారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితులు న‌లుగురిపైన ప్రొటెక్ష‌న్ ఆఫ్ చిల్డ్ర‌న్ ఫ్ర‌మ్ సెక్సువ‌ల్ అఫెన్సెస్ (POCSO-పోక్సో) చ‌ట్టం కింద జూన్ 30న ఎఫ్ఐఆర్ న‌మోదైంద‌ని పోలీసులు తెలిపారు. అనంత‌రం బాలిక‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించ‌గా అత్యాచారం జ‌రిగిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించార‌ని చెప్పారు. ఇప్ప‌టికే నిందితులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నామ‌ని, ద‌ర్యాప్తును వేగ‌వంతం చేస్తామ‌ని పోలీసులు చెప్పారు.       


logo