మంగళవారం 07 జూలై 2020
National - Jun 16, 2020 , 15:29:57

బాలికపై సామూహిక లైంగిక దాడి

బాలికపై సామూహిక లైంగిక దాడి

న్యూఢిల్లీ: ఓ బాలికపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ ఘటన జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన 16 ఏండ్ల బాలిక తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉన్నది. శుక్రవారం సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నది. ఒంటరిగా ఉన్న ఆ బాలికను గమనించిన కొందరు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె వెళ్లాల్సిన రైలు ఎక్కిస్తామని నమ్మించారు.

ఆ బాలికను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోగా మత్తులో రోడ్డు పక్కన ఉన్న బాలికను పోలీసులు గమనించారు. కోత్వాలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి మహిళా పోలీసుల చేత ఆరాతీయించగా ఈ విషయం తెలిసింది. ఆమెకు దవాఖానలో చికిత్స అందించిన అనంతరం చిన్నారుల సంక్షేమ సంఘానికి అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 



logo