సోమవారం 25 మే 2020
National - Apr 04, 2020 , 11:46:04

ఏపీలో కొత్త‌గా 16 మందికి క‌రోనా

ఏపీలో కొత్త‌గా 16 మందికి క‌రోనా

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ది. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 16 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఏపీలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180 కింది చేరింది. కొత్త‌గా న‌మోదైన 16 కేసుల్లో కృష్ణా జిల్లాకు చెందినవారు న‌లుగ‌రు, క‌డ‌ప‌ జిల్లాకు చెందిన‌వారు న‌లుగురు, గుంటూరు జిల్లాకు చెందిన‌వారు ముగ్గురు, క‌ర్నూల్ జిల్లాకు చెందిన‌వారు ముగ్గ‌రు, ప్ర‌కాశం, చిత్తూరు జిల్లాల‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం బులెటిన్ విడుద‌ల చేసింది. ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా 180 కేసుల న‌మోదు కాగా.. నెల్లూరు జిల్లాలో అత్య‌ధికంగా 32 కేసులు, అనంత‌పురం జిల్లాలో అతిత‌క్కువ‌గా 2 కేసులు న‌మోద‌య్యాయి. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo