శుక్రవారం 05 జూన్ 2020
National - May 08, 2020 , 08:06:22

రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతి

రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతి

ముంబయి : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున 5.15 గంటలకు రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతిచెందారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు. వీరంతా కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు. రైళ్లు నడవడం లేదన్న ఆలోచనతో కావచ్చు అలసిన శరీరాలతో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ట్రాక్‌పై నిద్రకు ఉపక్రమించారు. కాగా జల్నా-ఔరంగాబాద్‌ మధ్య నడిచే గూడ్స్‌ రైలు వీరు నిద్రిస్తున్న ట్రాక్‌పై నుంచి పోవడంతో కూలీలంతా అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానిక పోలీసులు, రైల్వే పోలీస్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. 




logo