మంగళవారం 26 జనవరి 2021
National - Dec 06, 2020 , 10:29:11

అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. 20 మందికి గాయాలు

అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. 20 మందికి గాయాలు

ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలో అత్యంత రద్దీగా ఉండే లాల్‌బాగ్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో 20 మంది గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్లు, రెండు భారీ ట్యాంకర్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లో మంటలు చెరేగాయని, దానివల్ల గ్యాస్‌ సిలిండర్ పేలిందని అగ్నిమాక అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం ఉదయం 7.30 గంటలకు జరిగిందని, 30 నిమిషాలుగా మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.  


logo