గురువారం 02 జూలై 2020
National - Jun 27, 2020 , 19:30:08

గాల్వ‌న్ శాటిలైట్ చిత్రాలు.. 16 చోట్ల చైనా క్యాంపులు

గాల్వ‌న్ శాటిలైట్ చిత్రాలు.. 16 చోట్ల చైనా క్యాంపులు

హైద‌రాబాద్‌: వివాదాస్ప‌దంగా మారిన గాల్వ‌న్ న‌ది వ‌ద్ద చైనా భారీ టెంట్లు వేసింది.  ఆ దేశానికి చెందిన పీఎల్ఏ ద‌ళాలు .. న‌ల్ల‌రంగు ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌తో టెంట్లు వేసిన‌ట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాల‌ను ఓ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. వాస్త‌వాధీన రేఖ వెంట ఆ ప్రాంతంలో సుమారు 9 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో చైనా ఆర్మీ 16 క్యాంపులు వేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. వాస్త‌వాధీన రేఖ నుంచి వెన‌క్కి వెళ్తామ‌న్న సైనిక చ‌ర్చ‌ల్లో అంగీక‌రించినా.. ఇప్ప‌టి వ‌ర‌కు చైనా అలాంటి అడుగులు వేయ‌లేద‌ని శాటిలైట్ చిత్రాల ద్వారా అర్థ‌మ‌వుతున్న‌ది. జూన్ 22వ తేదీన జ‌రిగిన లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ర్యాంక్ అధికారుల భేటీలో.. ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించేందుకు అంగీకారం కుదిరింది. కానీ ఆ దిశ‌గా చైనా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని తెలుస్తోంది.

జూన్ 25, 26 తేదీల్లో ప్లానెట్ ల్యాబ్స్ తీసిన ఫోటోలు ఇవాళ రిలీజైయ్యాయి. గాల్వ‌న్ ప్రాంతంలో చైనా తిష్ట‌వేసుకున్న‌ట్లుకు ఆ ఇమేజ్‌లతో స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. జూన్ 15వ తేదీన జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందారు.  చైనాకు చెందిన 45 మంది సైనికులు కూడా మృతిచెందిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్న‌ది. logo