సోమవారం 18 జనవరి 2021
National - Jan 05, 2021 , 10:17:12

దేశంలో కొత్తగా 16,375 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 16,375 కరోనా కేసులు

న్యూఢిల్లీ  : గడిచిన 24 గంటల్లో దేశంలో 16,375 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. మహమ్మారి నుంచి 29,091 మంది తాజాగా కోలుకొని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి అయ్యారని, వైరస్‌ ప్రభావంతో మరో  201 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,56,845కు చేరగా.. ప్రస్తుతం దేశంలో 2,31,036 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. వైరస్‌ నుంచి 99,75,958 కోలుకున్నారని, మహమ్మారితో ఇప్పటి వరకు 1,49,850 మంది మృత్యువాతపడ్డారని వివరించింది. ఇదిలా ఉండగా.. సోమవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 8,96,236 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పేర్కొంది. ఇప్పటి వరకు 17,65,31,997 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.