శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 15:53:03

రాష్ర్ట‌ప‌తికి 15వ ఆర్థిక సంఘం నివేదిక స‌మ‌ర్ప‌ణ‌

రాష్ర్ట‌ప‌తికి 15వ ఆర్థిక సంఘం నివేదిక స‌మ‌ర్ప‌ణ‌

ఢిల్లీ : ఎన్‌కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం రాష్ర్ట‌ప‌తి  రామ్‌నాథ్ కోవింద్‌కు సోమ‌వారం త‌న తుది నివేదికను స‌మ‌ర్పించింది. 2021-22 నుండి 2025-26 వరకు ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన తుది నివేదికను స‌మ‌ర్పించింది. దేశంలోని 28 రాష్ర్టాల ప్ర‌త్యేక అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నివేదిక‌ను రూపొందించి స‌మ‌ర్పించిన‌ట్లుగా ఆర్థిక‌సంఘం పేర్కొంది. ఫైనాన్స్ క‌మిష‌న్ ఇన్ కొవిడ్ టైమ్స్ పేరుతో రాష్ర్ట‌ప‌తికి 4 భాగాలుగా నివేదికను స‌మ‌ర్పించిన‌ట్లు వెల్ల‌డించింది. 

రాష్ర్టాల ప్రాధాన్య‌త‌ల‌ను, అంశాల‌ను రాష్ర్టాల వారీగా నివేదిక‌లో ప్ర‌స్తావించడంతో పాటు ప‌న్నుల పంప‌కాలు, స్థానిక సంస్థ‌ల‌కు నిధుల విష‌యాల‌పై కీల‌క సూచ‌న‌లు చేసిన‌ట్లుగా స‌మాచారం. ప్ర‌తిభ చూపుతున్న రాష్ర్టాల‌కు ప్రోత్సాహ‌కాల‌పై ప్ర‌త్యేకంగా ప‌రిశీలించాల‌ని విన్న‌వించింది. అదేవిధంగా ర‌క్ష‌ణ‌, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త నిధుల కోసం ప్ర‌త్యేక‌ యంత్రాంగం విష‌యాన్ని ప‌రిశీలించాలంది. నివేదిక‌ను కేంద్రం పార్ల‌మెంటులో టేబుల్ చేశాక ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురానుంది.