శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 21:16:35

యూపీలో 3,214 కేసులు.. 66 మ‌ర‌ణాలు

యూపీలో 3,214 కేసులు.. 66 మ‌ర‌ణాలు

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం కొత్త‌గా 155 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,214కు చేరింది. అయితే మొత్తం కేసుల‌లో 1,387 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 66 మంది మ‌ర‌ణించారు. మిగ‌తా 1761 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తర‌ప్ర‌దేశ్ ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 


logo