ఆదివారం 31 మే 2020
National - May 15, 2020 , 16:26:16

క్వారంటైన్ కు 154 మంది నౌకాయాన సిబ్బంది: గోవా సీఎం

క్వారంటైన్ కు 154 మంది నౌకాయాన సిబ్బంది: గోవా సీఎం

పానాజీ: వివిధ నౌక‌ల్లో ప‌నిచేసి గోవాకు వ‌చ్చిన 154 మంది సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచ‌నున్న‌ట్లు గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ తెలిపారు. ఇవాళ 154 మంది నౌకాయాన సిబ్బందిని ముంబై పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా గోవాకు తీసుకొచ్చాం. వారిని క్వారంటైన్ కు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశాం. నౌకాయాన సిబ్బందికి క్వారంటైన్ లో ఉన్న‌పుడు అయ్యే ఖ‌ర్చంతా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. వారంద‌రినీ క్వారంటైన్ లో ఉంచే ముందు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. గ‌త నెల‌లో 100 నౌకాయ‌న సిబ్బంది గోవాకు తిరిగి రాగా..ఇది రెండో బ్యాచ్ అని అన్నారు. 

దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న గోవా ప్ర‌జ‌ల‌ను సుర‌క్షితంగా స్వ‌స్థ‌లాల‌కు తీసుకొచ్చేందుకు ఎప్ప‌టిక‌పుడు కేంద్రప్ర‌భుత్వ విభాగాలతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని సీఎం ప్ర‌మోద్ సావంత్ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo