గురువారం 02 జూలై 2020
National - Jun 28, 2020 , 20:28:58

48గంటల్లో.. 150మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

48గంటల్లో.. 150మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

ముంబై : మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు వైరస్‌ బారినపడి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్ర పోలీసుశాఖలో 48గంటల వ్యవధిలో 150మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 4,666కు చేరింది. 

ఆదివారం ఒకరు మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 57కి చేరిందని ఉన్నతాధికారులు తెలిపారు. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,59,133 కేసులు నమోదుకాగా ఇందులో 67,615 యాక్టివ్‌ కేసులున్నాయి. 84,245మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 7,273 మృతి చెందారని ప్రభుత్వం ఓ బులిటెన్లో వెల్లడించింది. 


logo