గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 16:22:54

మ‌హారాష్ట్ర పోలీస్‌లో మ‌రో 150 మందికి క‌రోనా

మ‌హారాష్ట్ర పోలీస్‌లో మ‌రో 150 మందికి క‌రోనా

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ప్ర‌తిరోజు కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఆదివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు గ‌త 48 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 150 మంది మ‌హారాష్ట్ర పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్ర పోలీస్ సిబ్బందిలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,666కు చేరింది. గ‌త 48 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో పోలీస్ క‌రోనా కార‌ణంగా మృతిచెంద‌డంతో మొత్తం మృతుల సంఖ్య 57కు చేరింది. మ‌హారాష్ట్ర పోలీస్ విభాగం ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.      


logo