బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 13:09:05

కరోనా చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన ఛతీస్‌గఢ్‌ సీఎం

కరోనా చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన ఛతీస్‌గఢ్‌ సీఎం

రాయ్‌పూర్‌ :  ఛతీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని అగ్రసేన ధామ్‌ వద్ద150 పడకల కోవిడ్‌-19 చికిత్స కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. మంగళవారం ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  దీనిని ప్రారంభించారు. ఇక్కడ కోవిడ్‌ రోగులకు ఉచిత చికిత్సతోపాటు మందులు అందించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో సామాన్యులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మార్చిలో కరోనా ప్రారంభం నాటికి రాయ్‌పూర్‌ ఎయిమ్స్‌లో మాత్రమే బాధితులు చికిత్స పొందేందుకు అవకాశం ఉండేది. రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం  చికిత్స కేంద్రాలను పెంచింది. ఇప్పటికే 29 ప్రభుత్వ దవాఖానలను కోవిడ్‌-19 చికిత్స కేంద్రాలుగా మార్చింది. కొత్తగా 186 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 19 ప్రైవేట్‌ దవాఖానల్లో బాధితులు చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది’ అని సీఎం భగేల్‌ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo